![]() |
![]() |

యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ తన సొంత ఇంటి కలను నెరవేర్చుకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి ఆమె గృహప్రవేశం చేసింది.
ప్రతిభకు వయస్సుతో సంబంధం లేదని రుజువు చేసింది గంగవ్వ. ఊరిలోని పిల్లలు, యువకులతో కలిసి ఆమె చేసిన కామెడీ వీడియోలు ఆమెకి పాపులారిటీని తీసుకొచ్చాయి. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్ గా ఛాన్స్ దక్కించుకున్న ఆమె మరింత పాపులర్ అయింది. అయితే అనారోగ్యం కారణంగా ఐదు వారాలకే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది. అయితే ఆమె సొంతింటి కల గురించి తెలుసుకున్న నాగార్జున బిగ్ బాస్ లో ఆమె గెలుచుకున్న డబ్బులతో పాటు సొంతంగా తాను కూడా ఇంటి నిర్మాణం కోసం ఆర్థికంగా సాయం చేశాడు. అలా ఆమె బిగ్ బాస్ నుంచి బయటకి కొన్నాళ్ళకి మొదలైన ఇంటి నిర్మాణం ఇటీవల పూర్తయింది. దీంతో తాజాగా గంగవ్వ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది.

స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బిగ్ బాస్ 4 రన్నరప్ కంటెస్టెంట్స్ అఖిల్ సార్థక్, సావిత్రి(శివ జ్యోతి), మై విలేజ్ షో టీం సభ్యులు, తదితరులు గంగవ్వ గృహ ప్రవేశ వేడుకకు హాజరయ్యారు. గంగవ్వ కొత్త ఇంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
![]() |
![]() |